ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. తెలుగు మీడియా రంగంలో ఎవ్వరూ.. ఎన్నడూ ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా టాప్ 3గా చెప్పుకునే TV9, TV5, NTV ఛానెల్స్.. ఒక్కోదాని రంగు- రుచి- వాసన పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు పచ్చమీడియా అంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో తిట్టిన తిట్లు తిట్టించుకోని TV 9.. ఆ తర్వాత అనూహ్యంగా మైహోం గ్రూప్ చేతుల్లోకి చేరి ఇప్పుడు గులాబీ గిరి చేస్తోంది.ఇక NTVలోనూ మైహోం గ్రూప్ షేర్స్ ఉన్నాయని చెప్తుంటారు.అందుకే ఆ ఛానెల్ కూడా టీఆర్ఎస్ హైకమాండ్ ను నొప్పించకుండా మసులుకుంటూ వార్తల ప్రసారం సాగిస్తోంది. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి ఇప్పుడు TV5 కూడా చేరిపోయింది. ఇన్నాళ్లు ఫక్తూ టీడీపీ వాయిస్ వినిపించిన ఈ ఛానెల్.. ఇకపై పింక్ ఇంక్ నింపుకోబోతోంది.

TV5 ని మైహోం గ్రూప్ టేకోవర్ చేయబోతోందని మీడియా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అలాగే టీఆర్ఎస్ కీలక నేత బంధువులు కూడా ఈ ఛానెల్ లో ఓ‌ హ్యాండ్ వేయబోతున్నారని తెలుస్తోంది. సో రానున్న రోజుల్లో TV5 గతానికి భిన్నంగా కనిపిస్తే..వినిపిస్తే షాక్ కావొద్దు సుమా!